Ram Charan : ఇంట్లో టీమిండియా క్రికెటర్స్ హల్‌చల్

by sudharani |   ( Updated:2022-09-26 10:02:48.0  )
Ram Charan : ఇంట్లో టీమిండియా క్రికెటర్స్ హల్‌చల్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా మధ్య నిన్న మూడో టీ 20 మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఉత్కంఠ బరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్ అనంతరం భారత క్రికెటర్స్ హార్థిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్‌తో సహా పలువురు క్రికెటర్స్ రామ్ చరణ్ ఇంట్లో సందడి చేశారు.

ఈ సందర్భంగా ఆటగాళ్లను సన్మానించి.. చిరంజీవి, రామ్ చరణ్ వారితో కొంచెం సేపు ముచ్చటించారు. మెగా కుటుంబసభ్యులు సైతం ఈ సెలబ్రేషన్స్‌లో పాలుపంచుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ త్వరలోనే అధికారింగా షేర్ చేయనున్నారు అనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే.. రామ్ చరణ్ ఇంట్లో నివాసం ఉండే ఓ వ్యక్తి హార్థిక్ పాండ్యతో కలిసి దిగిన ఫొటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ALSO READ : మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.. 'కోడ్ నేమ్ : తిరంగా'పై Parineeti Chopra

Advertisement

Next Story