- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తారక్ సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా.. మహిళల పట్ల ఇంత గౌరవమా (వీడియో)
దిశ, సినిమా: కన్నడ రాష్ట్ర రాజ్యోత్సవం వేడుకలో కన్నడ పవర్‌స్టార్ పునీత్‌రాజ్‌కుమార్‌కు కన్నడ రత్న బిరుదుని ప్రధానోత్సవం చేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా సూపర్ స్టార్ రజనీకాంత్, ఎన్టీఆర్‌లను ముఖ్యఅతిథులుగా ఆహ్వానించారు. వీరిద్దరి చేతుల మీదుగా పునీత్ రాజ్‌కుమార్ సతీమణికి కన్నడ రత్న బిరుదు అందజేశారు. ఇక తారక్‌కు మహిళలు, పెద్దల పట్ల తనకున్న అపారమైన గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి సింప్లిసిటీతో మరోసారి ప్రశంసలు పొందుతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
అసలు విషయం ఏంటంటే ఈవెంట్ ప్రారంభంలో రాష్ట్ర అతిథులను పిలుస్తున్నప్పుడు వారు కూర్చోబోయే ముందే అక్కడ వర్షం ప్రారంభమైంది. తారక్ త్వరగా పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని కోసం కుర్చీని తుడిచి ఆమెను అక్కడ కూర్చోబెట్టాడు. తరువాత వెంటనే ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్పర్సన్ సుధా మూర్తిని కూర్చోమని కోరాడు. దీంతో ఆయన సింప్లిసిటీ నెటిజన్ల హృదయాలను దోచుకుంటుండగా.. ఇందుకు సంబంధించిన వీడియో సూపర్ వైరల్‌గా మారింది.
Read more :