గంగానదిలో నిండా మునిగిన బోల్డ్ బ్యూటీ.. జనాలకు దూరంగా ఉండాలంటూ ట్రోలింగ్

by Anjali |   ( Updated:2023-08-18 16:39:59.0  )
గంగానదిలో నిండా మునిగిన బోల్డ్ బ్యూటీ.. జనాలకు దూరంగా ఉండాలంటూ ట్రోలింగ్
X

దిశ, సినిమా: సీనియర్ నటి తనుశ్రీ దత్తా ఇటీవల ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తూ దేవుళ్లపై తనకున్న భక్తిని చాటుకుంటోంది. అంతేకాదు తన అభిమానులకు సందర్శన ప్రత్యేకతలు వివరిస్తూ అలరిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ‘వారణాసిలోని మణికర్ణిక ఘాట్.. కాశీ విశ్వనాథ వద్ద పవిత్ర గంగానదిలో స్నానం చేసిన అద్భుత అనుభవం’ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అయితే ఇందుకు బంధించిన ఫొటో, వీడియోలను వైరల్ అవుతుండగా.. ‘తనుశ్రీ దత్తా కాశీ గంగలో స్నానం చేశావా? నీకు చర్మ వ్యాధులు రాబోతున్నాయి. ఎందుకంటే గంగానది పవిత్ర జలం ఇటీవల మురికిగా మారింది. కాబట్టి అక్కడ నీటిని తాకడం అసలే మంచిది కాదు. మూడనమ్మకాలను గుడ్డిగా అనుసరిస్తూ నీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నావ్. కొంతకాలం జనాలకు దూరంగా ఉండండి’ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే విమర్శలపై వెంటనే స్పందించిన నటి.. ‘ఓ మై డియర్ గాడ్!! నాకు ఇదంతా తెలియదు. కొన్ని చుక్కల గంగాజలం తాగినప్పటికీ నేను పూర్తి క్షేమంగానే ఉన్నాను. మీరు చర్మ వ్యాధులకు సిద్ధంగా ఉండండి’ అంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చేందుకు ట్రై చేసింది.

Read More: రోడ్డుపై కూతురితో సురేఖ వాణి హల్ చల్.. ‘కాంబో రేటు ఎంత’ నెటిజన్ వల్గర్ కామెంట్

Advertisement

Next Story