‘గుంటూరు కారం’ స్టోరీ నెరేటర్‌గా తమిళ నటుడు..

by Hamsa |   ( Updated:2023-06-06 09:30:54.0  )
‘గుంటూరు కారం’ స్టోరీ నెరేటర్‌గా తమిళ నటుడు..
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా మాస్ చిత్రం ‘గుంటూరు కారం’. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్‌మెంట్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించగా.. మహేష్ మాస్ లుక్‌ అభిమానులకు కిక్ ఇస్తోంది. దీంతో మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇకపోతే ఈ మధ్య కాలంలో తన వాయిస్‌తోనే ఫాలోయింగ్ దక్కించుకున్న నటుడు అర్జున్ దాస్.. ‘ఖైదీ’ సినిమాలో విలన్‌గా నటించిన విషయం తెలిసిందే. సీరియస్ యాక్షన్ మోడ్‌లో సాగే ఆ పాత్రతో పాటు, తన వాయిస్ కూడా అంతే హైలైట్ అయింది. ఆ వాయిస్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. దీంతో ‘గుంటూరు కారం’ బ్యాక్ గ్రౌండ్‌లో స్టోరీ నెరేట్ చేసే బాధ్యత త్రివిక్రమ్ అర్జున్ దాస్‌కు అప్పగించినట్లు సమాచారం. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read... ‘ఆదిపురుష్’ టికెట్ రేట్స్ పెరగనున్నాయా?

Advertisement

Next Story