బాలయ్యతో నేను సాంగ్ చేయడమేంటి?.. ఫైర్ అయిన మిల్కీ బ్యూటీ..

by samatah |   ( Updated:2023-05-21 12:43:01.0  )
బాలయ్యతో నేను సాంగ్ చేయడమేంటి?.. ఫైర్ అయిన మిల్కీ బ్యూటీ..
X

దిశ, సినిమా : బాలయ్య - అనిల్ రావిపూడి కాంబినేషన్‌‌లో వస్తున్న సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా స్పెషల్ మసాలా సాంగ్ చేస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవమని ట్విట్టర్ వేదికగా క్లారిటీ ఇచ్చింది ముద్దుగుమ్మ. ‘నేను అనిల్ రావిపూడి సార్‌తో పని చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. ఆయనపైనా, నందమూరి బాలకృష్ణ సార్‌పైనా నాకు చాలా గౌరవం ఉంది. అయితే వారి కొత్త చిత్రంలో ఒక పాట గురించి నిరాధారమైన వార్తా కథనాలను చదవడం బాధ కలిగించింది. మీరు ఇలాంటి ఆరోపణలు చేసే ముందు దయచేసి సెర్చ్ చేయండి’ అని రాసుకొచ్చింది. కాగా దీనిపై స్పందిస్తున్న ఫ్యాన్స్.. యాక్షన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. లేదంటే విజయ్ వర్మ విషయంలో వచ్చినట్లుగా ఫేక్ న్యూస్ వస్తూనే ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

Read More: అతని చేతిలో దారుణంగా మోసపోయిన కాజల్ చెల్లి.. అందుకే ఇండస్ర్టీకి దూరం..

Advertisement

Next Story