ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫర్ఫార్మెన్స్‌.. ఫ్యాన్స్ పొగడ్తలకు పడిపోయిన తమన్న

by samatah |
ఇది నా కెరీర్‌లోనే బెస్ట్‌ ఫర్ఫార్మెన్స్‌.. ఫ్యాన్స్ పొగడ్తలకు పడిపోయిన తమన్న
X

దిశ, సినిమా: రజనీకాంత్, తమన్నా భాటియా జంటగా వస్తున్న తాజా చిత్రం ‘జైలర్’. త్వరలోనే విడుదలకాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆడియో వేడుక నిర్వహించిన మూవీ టీమ్ ఇందులో భాగంగా ‘నువ్ కావాలయ్యా’ అనే సాంగ్ రిలీజ్ చేసింది. అయితే ఈ పాటకు తమన్న వేదికపైనే అదిరిపోయే స్టెప్పులేయగా ప్రస్తుతం ఈ సాంగ్ ట్రెండింగ్‌లో ఉంది. కాగా తన డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్‌కు ఫిదా అయ్యామంటూ కుర్రాళ్లు చేస్తున్న కామెంట్స్‌పై రీసెంట్ ఇంటర్వ్యూలో స్పందించిన మిల్కీ బ్యూటీ.. ‘నటిగా నా సుదీర్ఘ కెరీర్‌లో సరికొత్త అనుభవమిది. ఈ పాట ఇంతమందికి నచ్చడం, సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో ఉండటం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్‌లో నేను చేసిన డ్యాన్స్‌ కెరీర్‌లోనే బెస్ట్‌ అని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ‘జైలర్‌’ పక్కా తమిళ చిత్రం. ఇక్కడి నేటివిటీతో కనిపిస్తుంది. అయితే కథలో ఉండే అంశాలు మాత్రం పాన్‌ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల్ని మెప్పిస్తాయి’ అంటూ సినిమాకు సంబంధించిన పలు విషయాలు చెప్పుకొచ్చింది.

Also Read: పాపను కన్నది అందుకే Ranbir Kapoorపై Kangana సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story

Most Viewed