తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన Tamanna

by Vinod kumar |   ( Updated:2022-12-07 13:25:58.0  )
తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టిన Tamanna
X

దిశ, సినిమా: మిల్కీ బ్యూటీ తమన్నా స్టార్ హీరోలందరితో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమన్నా చేతిలో మూడు ఓటీటీ సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు మెగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తుంది. అలాగే ఒక మలయాళ సినిమాలో కూడా నటించబోతోంది. అయితే గత కొంతకాలంగా తమన్నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రీసెంట్‌గా తన అప్‌కమింగ్ మూవీ 'గుర్తుందా శీతాకాలం' మూవీ ప్రొమోషన్స్‌లో పాల్గొన్న నటి.. తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 'నా పెళ్లి గురించి మా ఇంట్లో ఒత్తిడి చేస్తున్న మాట నిజమే. సంబంధాలు కూడా చూస్తున్నారు. కానీ, ఈలోపే నాకు ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్తతో ఆ తర్వాత ఒక స్టార్ హీరో‌తో సోషల్ మీడియాలో రెండు సార్లు పెళ్లి చేసేశారు. ఒకవేళ నాకు పెళ్లి ఫిక్స్ అయితే అందిరికీ చెబుతాను. ఈ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచాల్సిన అవరసరం లేదు' అంటూ చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ.

ఇవి కూడా చదవండి : కమల్‌హాసన్‌తో సహజీవనం చేయట్లేదు: పూజా కుమార్

Advertisement

Next Story