ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది.. సరైన టైమ్ రావాలి

by Seetharam |   ( Updated:2022-10-17 15:10:09.0  )
ఆ కోరిక తీర్చుకోవాలని ఉంది.. సరైన టైమ్ రావాలి
X

దిశ, సినిమా : మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి, పిల్లలను కనడంపై మరోసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.తాజాగా ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తాను పెళ్లికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేసింది. త్వరలోనే నచ్చిన వాడిని పెళ్లి చేసుకుని పిల్లలను కూడా కనాలనుకుంటున్నట్లుగా వెల్లడించింది. 'నేను కూడా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా. నాకు పెళ్లిపై అపారమైన నమ్మకం ఉంది. సరైన సమయం వచ్చినప్పుడు కచ్చితంగా చేసుకుంటా. ఏ విషయంలోనూ ఎదుటివారి నిర్ణయాలపై ఆధారపడను.

భాగస్వామిని కనుగొనే విషయంలోనూ ఇతరులకు నచ్చే విధంగానే ఆలోచిస్తా. త్వరలోనే ఆ కోరిక తీర్చుకుని పిల్లలతో ఎంజాయ్ చేస్తా' అంటూ చెప్పుకొచ్చింది. ఇక అప్పటిదాకా తనపై పుకార్లు ఆపాలన్న నటి.. టైమ్ చూసుకుని వివరాలన్నీ తానే స్వయంగా వెల్లడిస్తానంటూ ముగించింది. ప్రస్తుతం చిరు సరసన 'భోళా శంకర్', రజినీ కాంత్‌ మూవీ 'జైలర్'లోనూ నటిస్తున్న బ్యూటీ.. కోలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి :

నా పనికి ఎవరూ 'నో' చెప్పకూడదు : మలైకా

Advertisement

Next Story

Most Viewed