సినిమాకు దూరంగా ఉంటున్న తాప్సీ.. స్ట్రాటజీ నచ్చకనే..

by sudharani |   ( Updated:2023-10-07 12:18:16.0  )
సినిమాకు దూరంగా ఉంటున్న తాప్సీ.. స్ట్రాటజీ నచ్చకనే..
X

దిశ, సినిమా : బ్యూటిఫుల్ తాప్సీ పన్ను అవుట్ సైడర్స్ ఫిల్మ్స్ పేరుతో ఇప్పటికే సొంత బ్యానర్ స్టార్ట్ చేసింది. ప్రస్తుతం వయాకామ్18 సంస్థతో కలిసి ‘ధక్ ధక్’ సినిమాను నిర్మిస్తుంది. రత్న పటాక్ షా, సంజనా సంఘీ, ఫాతీమా సనా షేక్, దియా మీర్జా ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు సెప్టెంబర్ 27న జరిగిన మీటింగ్‌లో నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కనీసం ట్రైలర్ కూడా విడుదల చేయలేదు. ముందుగా అనుకున్న ప్రకారం 16 రోజుల ప్రమోషన్స్ కూడా లేవు. మొత్తానికి వయాకామ్ 18 స్ట్రాటజీ గందరగోళంగా ఉండటంతో హర్ట్ అయిన తాప్సీ.. ఈ సినిమాకు దూరంగా ఉంటుందని ఇండస్ట్రీ టాక్.

Advertisement

Next Story