- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలీవుడ్ ఇండస్ట్రీపై తాప్సీ షాకింగ్ కామెంట్స్.. కొత్తగా ట్రై చేయట్లేదంటూ
దిశ, సినిమా: సొట్ట బుగ్గల చిన్నది తాప్సీపన్ను మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తలో నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో సరైన సక్సెస్ లభించగా బాలీవుడ్ మకాం మార్చిన ఆమె ప్రస్తుతం నటిగా, నిర్మాతగా తనకంటూ ప్ర్యతేకతను చాటుకుంటుంది. అయితే తను నిర్మాతగా వ్యవహరించిన నయా మూవీ ‘ధక్ ధక్’ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘నేను చాలామంది దర్శకులతో పనిచేశాను. కొత్త హీరోలతోనూ నటించాను. కాబట్టి ఒక సినిమాకు స్టోరీ ఇంపార్టెంట్ అని అనుకోను’ అని చెప్పింది. అలాగే ఇటీవల ఓటీటీల వల్ల పెద్ద నిర్మాణ సంస్థలు ఉనికి కోల్పోతున్నాయని, సినిమా విడుదలకు ముందే డిజిటల్ హక్కులు తక్కువ ధరకే పొందడం బాధకరమని చెప్పింది. ‘ఇది ఇండస్ట్రీపై ప్రభావం చూపుతుంది. బాలీవుడ్ ఎప్పుడు కొత్త వాటిని ప్రయత్నించదు. నాలాంటి వాళ్లు ట్రై చేసిన సపోర్టు ఇవ్వదు. బీ టౌన్‌లో చాలా మార్పులు రావాల్సివుంది’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
- Tags
- taapsee pannu