- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఒక్క క్షణం తీరిక లేదు.. ఒకరి తర్వాత ఒకరు నా వెంటపడ్డారు
దిశ, సినిమా: గత కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండటానికి గల కారణాలను వెల్లడించింది తాప్సీ. తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించిన ఆమె.. ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు? అని అడగగా.. ‘ఒక్క క్షణం పాటు తీరిక లేదు. దర్శకనిర్మాతలు టైమ్ ఇవ్వలేదు. వరుస సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్లే కాస్త గ్యాప్ తీసుకున్నా. అంతకుమించి మరో కారణం లేదు’ అని చెప్పింది. అలాగే ప్రస్తుతం షారుఖ్‌తో కలిసి ‘డుంకీ’ సినిమాలో నటిస్తున్నట్లు అభిమానులకు చెప్పిన నటి.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సంతోషంగా ఉందని, బాద్‌షా, డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలను నేర్చుకోగలమంటూ వాళ్లపై ప్రశంసలు కురిపించింది. చివరగా తన అలవాట్లు, ఇష్టాలకు సబంధించిన విషయాలను కూడా ఫాలోవర్లతో చెప్పుకుంటూ అలరించింది.