తల్లి పాత్రలో స్టార్ హీరోయిన్.. మరో యాక్షన్ థ్రిల్లర్‌కు సిద్ధమైన బ్యూటీ

by sudharani |   ( Updated:2024-09-10 14:11:33.0  )
తల్లి పాత్రలో స్టార్ హీరోయిన్.. మరో యాక్షన్ థ్రిల్లర్‌కు సిద్ధమైన బ్యూటీ
X

Taapsee Pannuదిశ, సినిమా: డార్లింగ్ ప్రభాస్ ‘Mr. పర్‌ఫెక్ట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న తాప్సీ పన్ను.. తర్వాత బాలీవుడ్ చెక్కేసింది. ప్రజెంట్ అక్కడ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుంది. అంతేకాకుండా విభిన్నమైన కథలు, పాత్రలు ఎంచుకుంటూ తనదైన స్టైల్లో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు మరో భిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతోంది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కాబోతున్న ఈ చిత్రానికి ‘గాంధారి’ అనే సరికొత్త టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తూ.. చిన్న వీడియో క్లిప్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ‘తల్లి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని అందరూ చెప్పారు. అలాగే తన బిడ్డ విషయానికి వస్తే.. ఆమె ప్రపంచాన్ని తలకిందులు చేస్తుంది’ అనే డైలాగ్‌తో స్టార్ట్ అయిన ఈ చిన్న వీడియో క్లిప్ ఆధారంగా ఇది తల్లి కూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్నట్లు చెప్పకనే చెప్పారు మేకర్స్. ఇందులో తాప్సీ తల్లి క్యారెక్టర్‌లో కనిపించనుండగా.. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నట్లు ప్రకంటించారు మేకర్స్.

Advertisement

Next Story

Most Viewed