పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయిన హీరోయిన్.. షాక్‌లో భర్త?

by Jakkula Samataha |
పెళ్లి చేసుకున్న విషయం మర్చిపోయిన హీరోయిన్.. షాక్‌లో భర్త?
X

దిశ, సినిమా : ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ తాప్సీ పన్ను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్, సాహసం, దరువు, గంగ, మొగుడు, వీర లాంటి సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ తగ్గడంతో బాలీవుడ్ చెక్కేసి అక్కడే స్థిరపడింది.

ఇక ఈ మధ్య ఈ నటి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని, తన మ్యారెజ్ ఫోటోస్ షేర్ చేసి అందరికీ షాకిచ్చింది. కాగా, తాజాగా ఈ ముద్దుగుమ్మ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ నటి లేటెస్ట్‌గా మూవీ ఫిర్ ఆయీ హసీన్ దిల్ రూబా సినిమాలో నటించింది. ఈ మూవీ ఆగస్టు 9న థియేటర్లలో రిలీజ్ కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు మేకర్స్. అయితే తాజాగా ఓ మీడియా ప్రమోషన్స్‌లో పాల్గొనగా, రిపర్టర్ తనకు కంగ్రాట్స్ చెప్పారు. దీంతో నాకెందుకు కంగ్రాట్స్ అని తాప్సీ అడగ్గా, మీరు పెళ్లి చేసుకున్నారు కదా అందుకే చెప్పాను అని రిపోర్టర్ చెప్తాడు.దీంతో తాప్సీ షాకై.. నేను పెళ్లి చేసుకున్న విషయమే నాకు గుర్తు లేదు నేను మర్చిపోయాను అంటుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఇక దీనిపై పలువురు .. తాప్సీ భర్త మథియాస్ బోయే షాక్‌లో ఉండి ఉంటారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



Next Story