OTT Bold Movie: మిల్క్ బ్యూటీ బోల్డ్ ట్రైలర్ విడుదల.. ఓవైపు భర్త మరోవైపు భాయ్‌ఫ్రెండ్.. యూత్‌కు పిచ్చేక్కిస్తోన్న ఘాటు రొమాన్స్

by Anjali |   ( Updated:2024-07-25 11:31:55.0  )
OTT Bold Movie: మిల్క్ బ్యూటీ బోల్డ్ ట్రైలర్ విడుదల.. ఓవైపు భర్త మరోవైపు భాయ్‌ఫ్రెండ్.. యూత్‌కు పిచ్చేక్కిస్తోన్న ఘాటు రొమాన్స్
X

దిశ, సినిమా: మూడేళ్ల కిందట మిల్క్ బ్యూటీ తాప్సీ అండ్ విక్రాంత్ మస్సీ ‘హసీన్ దిల్‌‌రుబా’ అనే చిత్రంలో నటించారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలై భారీ రెస్పాన్స్ అందుకున్న ఈ మూవీకి ‘ఫిర్ ఆయీ హసీన్ దిల్‌‌రుబా’ అనే టైటిల్‌తో సీక్వెల్ వస్తుంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఈ బ్యూటీ ఫస్ట్ టైం బోల్డ్‌గా కనిపించి.. యూత్‌కు పిచ్చేక్కిస్తోంది. తాజాగా (జులై 25) మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

పార్ట్-1 ఎక్కడ పూర్తయ్యిందో సరిగ్గా అక్కడి నుంచి రెండో భాగం ట్రైలర్ ప్రారంభించారు. ఇందులో తాప్సీ తన హాట్‌నెస్‌తో చంపేస్తుంది. ఈ సీక్వెల్‌లో హీరోయిన్‌కు కొత్త బాయ్ ఫ్రెండ్ పరిచయం అవుతాడు. అతడితో ఘాటు రొమాన్స్‌లో మునిగితెలుతుంటుంది. ఈ చిత్రం ఆగస్టు 9 నుంచి మొదటి భాగం స్ట్రీమింగ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లోనే రానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్లు జోరుగా నిర్వహిస్తున్నారు. వరుస పోస్టర్లు విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతున్నారు.

Advertisement

Next Story