- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shah Rukh Khan:‘అక్కడ షారుఖ్‌ను చూసి షాక్ అయ్యాను’.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్ షారుఖ్ ఖాన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. షారుఖ్-సుస్మితా జంటగా మైహూనా సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన ఫరాఖాన్ దర్శకుడిగా ఈ మూవీతోనే ఎంట్రీ ఇచ్చారు. సిర్ఫ్ తుమ్ సినిమాలోని దిల్బర్ దిల్బర్ సాంగ్ షూట్ చేస్తున్నప్పుడు దర్శకుడు తన తొలి చిత్రంలో కథానాయికగా నటిస్తారా? అని అడిగారని సుస్మితా వెల్లడించింది. దీంతో వెంటనే అంగీకరించానని, తప్పకుండా నచ్చిస్తానని మాట ఇచ్చానని తెలిపింది.
ఒక కొన్నాళ్లకు డైరెక్టర్ హీరోయిన్ ను అప్రోచ్ అయ్యారని, సినిమా స్టోరీ మొత్తం చెప్పారని వివరించింది. ఇక ఓ రోజు షూటింగ్ కోసం సెట్లోకి వెళ్లగా నిజంగా నేను షాక్ అయ్యానని తెలిపింది. ఎందుకంటే సెట్లో షారుఖ్ ఉన్నారు.. అతడు ఈ మూవీలో భాగమని నేను అస్సలు ఊహించలేదని పేర్కొంది. నా జీవితంలోనే ఓ అద్బుతమైన విషయమని హ్యాపీగా ఫీల్ అయ్యింది. షారుఖ్‌తో కలిసి వర్క్ చేయడం తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, అలాగే సినీ కెరీర్ ఓ మలుపు తిరిగిందని వ్యాఖ్యానించింది. సుస్మితా సేన్ మైహూనా చిత్రంలో చాందినీ పాత్రలో నటించి.. యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుందనడంలో అతిశయోక్తిలేదు.
సుస్మితా సేన్ ఈ చిత్రంలో మరింత ఫేమ్ దక్కించుకుంది. అప్పటి సంగతులను గుర్తుచేసుకున్న సుస్మితా సేన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సుస్మితా సేన్ ‘దస్తక్, రచ్చగన్, సిర్ఫ్ తుమ్, ఆఘాజ్, బస్ ఇత్నా సా ఖ్వాబ్ హై, ఫిజా, ముధల్వాన్,తుమ్కో నా భూల్ పాయేంగే, జిందగీ రాక్స్, ఇట్ వాజ్ రైనింగ్ దట్ నైట్, రామ్ గోపాల్ వర్మ కీ ఆగ్,నాట్ డిస్టర్బ్ చేయండి, దుల్హా మిల్ గయా, నో ప్రాబ్లమ్ కర్మ ఔర్ హోలీ, చింగారి’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల వద్ద ప్రశంసలు అందుకుంది.