Surya కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్!

by Hajipasha |   ( Updated:2023-01-09 05:21:59.0  )
Surya కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్!
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ స్టార్ హీరో సూర్య టాలీవుడ్, కోలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. విభిన్నమైన పాత్రలతో నటిస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఆకాశమే నీ హద్దురా, జై భీమ్, విక్రమ్‌లో రోలెక్స్ వంటి భారీ సినిమాలతో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఇక, సిరుతై శివ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న 42వ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాకు టైటిల్ ఇదేనా అని జనాలు చర్చించుకుంటున్నారు. అయితే 'వీర్' అనే టైటిల్‌ను పెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు రెండు పార్ట్‌లో ఉండగా.. త్రీడీలో విడుదల కానుంది. సూర్య సరసన దిశా పటాని హీరోయిన్‌గా నటించనుండగా.. సినిమాలో సూర్య 13 పాత్రలు పోషించనున్నాడు. ఇక, ఈ మూవీని డిజిటల్, థియేట్రికల్, శాటిలైట్ హక్కులు రూ. 100 కోట్లకు అమ్ముడయ్యాయని సమాచారం.

Also Read...

కొడుకుతో స్పెషల్ పోస్ట్ చేసిన రామ్.. షాక్‌లో ఫ్యాన్స్!

Advertisement

Next Story

Most Viewed