- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలిచ్చే తల్లుల గురించి ఇంత నీచంగా మాట్లాడతారా? నెటిజన్లపై నటి ఫైర్
దిశ, సినిమా: బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ బిడ్డను ప్రసవించిన తర్వాత బరువు తగ్గడం గురించి ప్రజలు చర్చించుకోవడం విచిత్రంగా అనిపించిందని చెప్తోంది సహానటి సుర్వీన్ చావ్లా. ఇటీవల వచ్చిన ‘రానా నాయుడు’ సిరీస్‌లో బోల్డ్ క్యారెక్టర్‌తో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసిన సుర్వీన్.. తాజాగా ఓ సమావేశంలో ఇండస్ట్రీలో వివాహితులు ఎదుర్కొనే సమస్యలగురించి మాట్లాడింది. ‘సమాజంలో ఒకరి బరువు గురించి మరొకరు చర్చించడం నాకు వింతగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఇండస్ట్రీలో వివాహితుల గురించి మరింత దిగజారి మాట్లాడటం నేను విన్నాను. మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్న గౌహర్ ఖాన్‌పై డిష్కసన్ చేయడం డర్టీగా అనిపించింది. ఎందుకంటే మాతృత్వం అనేది దాదాపు స్త్రీలందరినీ వరిస్తుంది. ఆ దశలో 10 రోజుల్లో 10 కిలోలు తగ్గినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మళ్లీ 100 రోజుల్లో ఊహించని బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మాతృత్వానికి బరువుకు సంబంధం అంటగట్టి నెగెటీవ్‌గా మాట్లాడటం నాకు నచ్చలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.