నాగార్జున బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్&DSP

by Anjali |   ( Updated:2024-08-30 02:07:58.0  )
నాగార్జున బర్త్ డే సందర్భంగా స్పెషల్ వీడియో షేర్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్&DSP
X

దిశ, వెబ్‌డెస్క్: అక్కినేని నాగేశ్వర రావు వారసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి అతితక్కువ సమయంలోనే స్టార్ హీరోల జాబితాలో స్థానం దక్కించుకున్నారు హీరో నాగార్జున. ఇప్పటికి యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ.. యంగ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. కింగ్ నాగార్జున దాదాపు 100 కు పైగా చిత్రాల్లో నటించి తెలుగు ఆడియన్స్ మెప్పు పొందారు. ‘బంగార్రాజు, మన్మథుడు 2, ఆఫీసర్, దేవదాస్, రాజు గారి గది2, ఓం నమో వేంకటేశాయ, సోగ్గాడే చిన్ని నాయనా, ఢమరుకం, రాజన్న, కింగ్, డాన్, శ్రీరామదాసు, మాస్,ప్రేమ యుద్దం, ప్రెసిడెంటు గారి పెళ్ళాం, ఘరానా బుల్లోడు, అన్నమయ్య’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు. ఇకపోతే నేడు ఈ హీరో పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికన అభిమానులు, పలువురు సినీ సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే సురేష్ ప్రొడక్షన్స్.. ‘ఎప్పటికీ మనోహరమైన రాజును కోరుకుంటున్నాం. నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు అండ్ రాబోయే సంవత్సరం బ్లాక్‌బస్టర్ #HBDKing నాగార్జున’ అంటూ వీడియో షేర్ చేశారు. అలాగే సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ ‘ప్రియమైన రాజుకు సూపర్ డూపర్ పుట్టినరోజు శుభాకాంక్షలు నాగార్జున సార్. ఎప్పుడూ మీ అసమానమైన ఆకర్షణ, మరపురాని సినిమాలు & సూపర్ కూల్ నేచర్‌తో రాకింగ్ చేస్తూ ఉండండి. మీతో అనుబంధం కలిగి ఉండటం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది’. అని సోషల్ మీడియా వేదికన విష్ చేశారు. “మాస్”(Mass4k) మూవీని థియేటర్లలో నిన్న (ఆగష్టు 28న) విడుదల చేశారు. థియేటర్లో నాగార్జున అభిమానులకు ఇది ఊహించని గిఫ్ట్ అని చెప్పుకోవచ్చు.

Advertisement

Next Story

Most Viewed