కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటో షూట్.. ‘ఫిదా’ అంటూ కుర్రాళ్ల కామెంట్లు

by Anjali |
కీర్తి సురేష్ లేటెస్ట్ ఫొటో షూట్.. ‘ఫిదా’ అంటూ కుర్రాళ్ల కామెంట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ‘నేను శైలజ, నేను లోకల్, మిస్ ఇండియా, మహానటి, రంగ్ దే’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది నటి కీర్తి సురేష్. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా ‘భోళా శంకర్’ చిత్రంలో, రజనీకాంత్ సినిమాలో కూడా సూపర్ స్టార్ కు ముద్దుల చెల్లిలిగా నటించింది. టాలీవుడ్‌లో దూసుకుపోతూనే ఈ ముద్దుగుమ్మ మరోవైపు బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే బాలీవుడ్ ప్రముఖ హీరో వరుణ్ ధావన్ సరసన అవకాశం కొట్టేసింది. వీరి జోడితో తెరకెక్కుతోన్న బేబీ జాన్ చిత్రం డిసెంబరు చివర్లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఇకపోతే కీర్తి సురేష్ తాజాగా అదిరిపోయే ఫొటో షూట్ చేసింది. స్లీవ్ లెస్ పంజాబీ డ్రెస్ ధరించి, డ్రెస్సుకు తగ్గ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుని క్యూట్ ఫొటోలకు ఫోజులిచ్చింది. తాజాగా కీర్తి కిర్రాక్ ఫొటోలకు ఇన్‌స్టాగ్రామ్‌లో తన అభిమానులతో పంచుకోగా.. ఫిదా అంటూ కీర్తి సురేష్ ను ఆకాశనెత్తుతున్నారు. క్యూట్ కామెంట్స్‌తో ముంచెత్తుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed