ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సురేఖ డేట్..! ముద్దులు కూడా..! సీక్రెట్ బయటపెట్టిన సుప్రిత

by sudharani |   ( Updated:2023-04-17 13:47:46.0  )
ఆ ఇద్దరు స్టార్ హీరోలతో సురేఖ డేట్..! ముద్దులు కూడా..! సీక్రెట్ బయటపెట్టిన సుప్రిత
X

దిశ, వెబ్‌డెస్క్: సురేఖ వాణి గురించి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సురేఖ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటుంది. తన కూతురితో ఎంజాయ్ చేస్తూ.. ఇద్దరు కలిసి పొట్టి పొట్టి డ్రెస్‌లతో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వీరిద్దరూ తమ వ్యక్తిగత విషయాల గురించి ముచ్చటించారు. ఈ క్రమంలోనే సుప్రిత తన తల్లి సురేఖ మనసులో ఉన్న మాటను బయటపెట్టింది.

ప్రస్తుతం సినిమాల్లో సురేఖ కనిపించనప్పటికీ సోషల్ మీడియా వేదికగా మాత్రం రచ్చ రేపుతూనే ఉన్నారు. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ తన పర్సనల్ విషయాల గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఇద్దరు. అయితే ఇంటర్వ్యూలో యాంకర్.. అమ్మ (సురేఖ వాణి) డేట్‌కి వెళ్లాల్సి వస్తే ఏ హీరోతో వెళుతుంది అని ప్రశ్నించాడు.

దానికి సుప్రిత స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్‌తో అని చెప్పింది. మా అమ్మకు ఆయనంటే చాలా ఇష్టం. ఆయనే కాదు నాగార్జునతోనూ వెళుతుంది అని చెప్పింది. దానికి సురేఖ కూడా కూతురు వ్యాఖ్యలకు స్పందిస్తూ ఒకే అన్నట్లు ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తుంది. అంతే కాకుండా వంద ముద్దులు పెట్టాల్సి వస్తే ఎవరికి పెడతారు అని అడగ్గా... ఆలోచించకుండా పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది సురేఖ వాణి. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Also Read..

పొట్టి డ్రెస్‌ ధరించి బీచ్‌లో రచ్చ చేసిన రేణు దేశాయ్.. (వీడియో)

సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న బాలీవుడ్ నటి?

Advertisement

Next Story

Most Viewed