తెల్లవార్లు అదే పని.. సుప్రితను గట్టిగా వాడేస్తున్నారుగా..!

by sudharani |   ( Updated:2024-04-22 10:02:56.0  )
తెల్లవార్లు అదే పని.. సుప్రితను గట్టిగా వాడేస్తున్నారుగా..!
X

దిశ, సినిమా: నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తల్లి, అక్క, భార్య ఇలా సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. సురేఖ వాణికి ఓ కూతురు ఉన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. అంతే కాదు తల్లి సురేఖ, కూతురు సుప్రిత ఇద్దరు నెట్టింట చేసే రచ్చ అంతా ఇంతా కాదు. పొట్టి పొట్టి బట్టలు ధరిస్తూ అందాలు ప్రదర్శిస్తుంటారు.

ఇక సోషల్ మీడియాలో వాళ్లకు ఉన్న ఫాలోయింగ్ కూడా ఎక్కువ. దీంతో వీళ్లు ఏ పోస్ట్ పెట్టిన అది క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే.. కూతురు సుప్రితను హీరోయిన్ చెయ్యాలన్న సురేఖ వాణి కల తాజాగా నెరవేరిన సంగతి తెలిసిందే. బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి హీరోగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైన్‌లో మూవీలో సుప్రిత హీరోయిన్‌గా నటించనుంది. మొదటి మూవీతోనే మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాలని ఈ సినిమా కోసం భారీగా కష్టపడుతుంది సుప్రిత.

దీంతో ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ షూటింగ్‌లో గంటల తరబడి కష్టపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని సుప్రితనే స్వమంగా ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘రాత్రి 1:45 నిమిషాలకు పోస్ట్ పెడుతూ ‘వర్క్ వర్క్ వర్క్’ అనే క్యాప్షన్ ఇచ్చింది. తర్వాత తెల్లవారు ఝామున 3 గంటలకు ప్యాక్‌అప్ అంటూ మరో పోస్ట్ పెట్టింది’ ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో ‘బాగానే కష్టపడుతున్నావు’ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. ‘సుప్రితను బాగా వాడేస్తున్నట్లు ఉన్నారుగా’ అంటూ మరికొందరూ రిప్లైలు ఇస్తున్నారు.

Read More..

అవకాశాలు తగ్గడంతో దానిపై ఫోకస్ పెట్టిన టాలీవుడ్ బ్యూటీ.. ఈ వయసులో ఏంటిది..?

Advertisement

Next Story

Most Viewed