- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'పెప్సీ' బ్రాండ్ అంబాసిడర్‌గా యశ్.. అభిమానుల రియాక్షన్ ఇదే..
దిశ, సినిమా : యూత్-సెంట్రిక్ బెవరేజ్ బ్రాండ్ 'పెప్సీ' తన బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ యశ్‌ను నియమించినట్లు బ్లాక్ బస్టర్ ప్రకటన చేసింది. జియో గ్రాఫికల్ బౌండరీస్‌ను బ్రేక్ చేస్తూ 'కేజీఎఫ్'తో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన యశ్ కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. 'నేను పెప్సీతో కొలాబొరేట్ కావడం, ఫేస్ ఆఫ్ ది బ్రాండ్‌గా మారడం ఆనందంగా ఉంది. నేను నా జీవితాన్ని సంపూర్ణంగా జీవించగలనని నమ్ముతా. ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేసుకుంటా. పెప్సీ ఫిలాసఫీకి పర్యాయపదంగా ఉన్న నా అభిరుచిని నిస్సంకోచంగా అనుసరిస్తున్నా. కొత్త సంవత్సరాన్ని ప్రారంభించేందుకు ఈ కొలాబొరేషన్ ఎగ్జయిట్మెంట్‌ను అందిస్తోంది. అభిమానులు త్వరలో నన్ను సరికొత్త అవతార్‌లో చూడబోతున్నారు' అని తెలిపాడు. 'కంగ్రాట్స్ పెప్సీ.. ఐ లవ్ యూ' అంటూ వీడియో పోస్ట్ చేశాడు. కాగా దీనిపై స్పందిస్తున్న అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇవి కూడా చదవండి : ఆ విషయం గుర్తొచ్చి నిద్రలో ఉలిక్కిపడి లేచే వాడిని: సుధీర్ బాబు