- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్‌లను తల్చుకుని బాధపడుతున్న చిరంజీవి.. ఎందుకంటే..
దిశ, సినిమా : తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ కలిగిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. కెరీర్ పరంగా చూస్తే దాదాపు అన్ని జోనర్ చిత్రాల్లో నటించి అలరించారు. విభిన్న పాత్రలు పోషించారు. కాగా చిరుకు మంచి ఫేమ్ తెచ్చిపెట్టింది మాత్రం మాస్ చిత్రాలే. యాక్టింగ్ ప్రయారిటీ ఉన్నటువంటి స్వయం కృషి, ఆపద్భాంధవుడు, రుద్రవీణ వంటి చిత్రాలు చిరు వృత్తి జీవితంలో మరుపురాని మధుర స్మృతులుగా ఎప్పటికీ నిలిచి ఉంటాయి.
సినిమాల పరంగా అభిమానుల్లో, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ మెగాస్టార్ మనసులో మాత్రం ఇప్పటికీ ఒక అసంతృప్తి ఉండిపోయిందట. తన సన్నిహితులవద్ద, కుటుంబ సభ్యుల వద్ద చిరు అప్పుడప్పుడూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఫీలవుతుంటారట. ఇంతకీ అదేంటంటే.. నాటి సూపర్ స్టార్ కృష్ణ, నందమూరి తారక రామారావు పేరు చెప్పగానే వెంటనే అందరికీ పౌరాణిక చిత్రాలు, పల్లెటూరి సినిమాలు గుర్తుకు వస్తాయి. ఎన్టీఆర్‌ను రాముడు, కృష్ణుడు, వివిధ పౌరాణిక పాత్రల్లో ప్రజలు ఊహించుకుంటారు. ఇక సూపర్ స్టార్ కృష్ణ పేరు వినగానే పల్లె సంస్కృతికి అద్దంపట్టేలా పచ్చని పొలాలు, రైతుల జీవితాలు కళ్లకు కడతాయి. అయితే అలాంటి ఇమేజ్ తనకు లేదని చిరంజీవి బాధపడుతుంటారట. ఎంత వరకు నిజమో కానీ ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.