కొడుకుపై సూపర్ స్టార్ కపుల్ స్పెషల్ పోస్టులు.. సినీ ఎంట్రీపై హింట్ ఇచ్చేశారుగా!

by Hamsa |   ( Updated:2024-08-31 14:10:17.0  )
కొడుకుపై సూపర్ స్టార్ కపుల్ స్పెషల్ పోస్టులు.. సినీ ఎంట్రీపై హింట్ ఇచ్చేశారుగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన నేనొక్కడినే చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. ఆ తర్వాత చదువుపై శ్రద్ధ పెట్టాడు. అయితే గౌతమ్ ప్రజెంట్ న్యూయార్క్‌లో ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ కోర్స్ నేర్చుకుంటున్నాడు. నాలుగేళ్ల ట్రైనింగ్ తర్వాత సినీ ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం కాబోతున్నట్లు సమాచారం.

అయితే నేడు గౌతమ్ పుట్టిన రోజు కావడంతో మహేష్ బాబు, నమ్రత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా విష్ చేశారు. ‘‘18వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ సమయాన్ని ఆస్వాదించు. అలాగే నువ్వు ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నీకు తండ్రిని అయినందుకు చాలా గర్వంగా ఉంది అని రాసుకొచ్చాడు. ఇక నమ్రత మాత్రం ‘‘ కొత్త ప్రారంభాలకు! పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఈ రోజు నీ జీవితంలో ఎంతో ముఖ్యమైనది. నీకు తల్లిదండ్రులుగా మేము గర్వపడే రోజు. నీవు అనుకున్న లక్ష్యాలను చేరుకుంటూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండు’’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ చూసిన వారు కొందరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సూపర్ స్టార్-2 సినీ ఎంట్రీపై హింట్ ఇచ్చిందని అంటున్నారు. ఓ నెటిజన్ ‘సినిమాల్లో నీ రాక.. మా అభిమానుల్లో కేక పుట్టించాలి. ఇండస్ట్రీలో నీ ఎంట్రీ.. మన కంట్రీ లో న్యూస్ అవ్వాలి’ అని కామెంట్ పెట్టాడు.

Advertisement

Next Story

Most Viewed