Megastar ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. బ్లాక్ బస్టర్ సినిమా రీరిలీజ్!

by sudharani |   ( Updated:2023-07-18 14:15:26.0  )
Megastar ఫ్యాన్స్‌కు సూపర్ న్యూస్.. బ్లాక్ బస్టర్ సినిమా రీరిలీజ్!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. తమ అభిమాన హీరోలు నటించిన సినిమా రీరిలీజ్ అవుతున్నాయంటే చాలు అభిమానులు రచ్చరచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చిన చాలా సినిమాలు భారీ కలెక్షన్లను రాబట్టాయి. గతంలో ప్లాప్ టాక్‌తో డిజాస్టర్‌గా నిలిచిన మూవీలు సైతం.. రీరిలీజ్‌లో అత్యధిక వసూళ్లను సాధిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీని రీరిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా..?

చిరంజీవి, శ్రీదేవీ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ‘జగదేకవీరుడు - అతిలోకసుందరి’. 1990లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో రికార్డులను తిరగరాసింది. ఈ సినిమాలో చిరంజీవి, శ్రీదేవి నటన ఇప్పటికీ ప్రేక్షకుల్లో చెరగని ముద్రలా గుర్తుంటుంది అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. ఈ సినిమాను మెగా స్టార్ చిరంజీవి బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్-22 న రీరిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ సినిమా నిజంగా రీరిలీజ్ అయితే మెగా అభిమానులకు ఇది పెద్ద ట్రీట్ అని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి: Lawrence-Nayanatara కాంబోలో హారర్ థ్రిల్లర్ మూవీ

Advertisement

Next Story