నా కూతురినే కాదు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు: స్టార్ హీరో ఎమోషనల్

by Aamani |   ( Updated:2023-04-23 12:21:38.0  )
నా కూతురినే కాదు, కుటుంబాన్ని టార్గెట్ చేశారు: స్టార్ హీరో ఎమోషనల్
X

దిశ, సినిమా : పరిచయం లేని వ్యక్తులు కూడా తమ కుటుంబాన్ని దుర్భాషలాడటంపై సునీల్ శెట్టి అసహనం వ్యక్తం చేశాడు. తన కూతురు అతియా శెట్టిని కూడా రకరకాల బిరుదులు ‘బిచ్’ వంటి పేర్లతో పిలవడం తనను బాధిస్తుందన్నాడు. నిజానికి తనకు సోషల్ మీడియాలోకి రావాలన్నా, ఈ వేదికలో ఏదైనా మాట్లాడాలన్నా నచ్చట్లేదన్న నటుడు.. ‘నాకు ట్విట్టర్‌ లేదా ఫేస్‌బుక్‌లోనూ తెలియని వ్యక్తులు నన్ను, నా కుటుంబంలోని వ్యక్తులను ఎగతాళి చేస్తున్నారు. నా కుమార్తెపై ట్రోలింగ్ చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఇలాంటి సంఘనలు ఎవరినైనా బాధిస్తాయి. నేటి సోషల్ మీడియాలో గోప్యత లేదు. అది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. ఒక వాక్యం 15 రకాలుగా సవరించబడుతుంది. అందుకే ఏదైనా మాట్లాడాలంటే భయంగా ఉంది’ అంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో పలు విషయాలు ప్రస్తావించాడు.

Also Read..సెక్స్ ఆశ చూపి సినిమా అవకాశాలు కొట్టేసింది.. అమాయకురాలేమీ కాదు

Advertisement

Next Story