'బాస్ పార్టీ'కి స్టెప్పులేసిన సుకుమార్, దేవిశ్రీ.. వీడియో అదుర్స్

by Hajipasha |   ( Updated:2023-02-06 04:07:35.0  )
బాస్ పార్టీకి స్టెప్పులేసిన సుకుమార్, దేవిశ్రీ.. వీడియో అదుర్స్
X

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ యాక్షన్ నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రల్లో నటిస్తుండడంతో ఈ సినిమాపై భారీగా హైప్ పెరిగింది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అలాగే పోస్టర్, టీజర్, సాంగ్స్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులో ముఖ్యంగా 'బాస్ పార్టీ' అంటూ సాగే ఈ పాట 26 మిలియన్ వ్యూస్ అందుకొని యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. తాజాగా ఈ పాటకి చిరు డైరెక్షన్‌లో.. టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, దర్శకుడు బాబీ, మైత్రి నిర్మాతలు డాన్స్ చేసి సందడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

'Also Read:
పాథోన్‌ పథం నూట్టండు' సినిమాతో.. 'కాంతారా' అవుట్ అవుతుందా?

Advertisement

Next Story