BIRTHDAY GIFT : హీరోయిన్‌కు పడవ, ఆమె అభిమానులకు వంద ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన బాయ్ ఫ్రెండ్

by Sujitha Rachapalli |
BIRTHDAY GIFT : హీరోయిన్‌కు పడవ, ఆమె అభిమానులకు వంద ఐఫోన్లు గిఫ్ట్‌గా ఇచ్చిన బాయ్ ఫ్రెండ్
X

దిశ, సినిమా : కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ గర్ల్ ఫ్రెండ్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే బహుమతులు ప్రకటించాడు. గత ఏడాది బుట్ట బొమ్మ అంటూ జైలు నుంచే ప్రేమ లేఖ రాసిన సుఖేష్.. ఈ ఏడాది బర్త్ డేకు భారీ గిప్ట్స్ లిస్ట్ అనౌన్స్ చేశాడు. ఈ శ్రీలంకన్ బ్యూటీకి యాచ్, ఆమె అభిమానులకు 100 ఐఫోన్లు(iPhone 15 Pro) ఇవ్వనున్నట్లు చెప్పాడు. ఫ్యాన్స్ పేర్లను లక్కీ డ్రాలో తీసి త్వరలో రిలీజ్ చేస్తామని తెలిపాడు.

ఇక ఈ న్యూస్ విన్న నెటిజన్లు... భలే కామెంట్స్ చేస్తున్నారు. అమ్మాయిలు ఇలాంటి అబ్బాయిలను బాయ్ ఫ్రెండ్ గా కోరుకుంటారని కొందరు టీజ్ చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం నిజంగా బాయ్స్ అలా ఉంటే బ్యాంక్ కు కన్నాలు వేయాల్సిందే.. సుఖేష్ లాగా జైలు లో కూర్చోవాల్సిందే అని ఇంకొందరు అంటున్నారు. ఇక అభిమానులు ఎవరో త్వరగా రివీల్ చేయాలని కోరుతున్నారు జాక్వెలిన్ ఫ్యాన్స్. మొత్తానికి తనకు ఏ సంబంధం లేదన్నా సరే జాక్వెలిన్ కు ఇలాంటి బహుమతులు పంపుతున్న సుఖేష్ అసలు సిసలు ప్రేమికుడు అంటున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story