- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరోయిన్‌కు సర్జరీ తప్పదంటున్న వైద్యులు.. సమస్య ఇదే!
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ ఆర్‌ఎక్స్ 100 మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. ప్రస్తుతం పాయల్, అజయ్ భూపతి కాంబినేషన్‌లో ‘మంగళవారం’ అనే పాన్ ఇండియా మూవీతో నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్ భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ఇక ఇటీవల రిలీజైన ట్రైలర్ అందరికీ చెమటలు పట్టించింది. అంతేకాకుండా యూట్యూబ్‌లో భారీ వ్యూస్ రాబడుతూ దూసుకుపోతుంది.
తాజాగా, పాయల్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేసింది. ‘‘ అజయ్ నన్ను అప్రోచ్ అయ్యే టైమ్‌కు నా పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలియదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. సర్జరీకి వెళ్లాల్సిందే అని వైద్యులు సూచించారు. అయితే అజయ్ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమా పూర్తయ్యాకే సర్జరీ చేయించుకోవడానికి వెళతాను’’ అంటూ చెప్పుకొచ్చింది.