rashmiతో పెళ్లిపై sudigali sudheer క్లారిటీ.. అభిమానుల రియాక్షన్ ఇదే!

by Hamsa |   ( Updated:2022-11-18 07:49:13.0  )
rashmiతో పెళ్లిపై sudigali sudheer   క్లారిటీ.. అభిమానుల రియాక్షన్ ఇదే!
X

దిశ, సినిమా: 'జబర్దస్త్'తో క్రేజీ ఆన్‌స్క్రీన్ కపుల్స్‌గా పేరొందిన రష్మి-సుధీర్.. నిజజీవితంలోనూ ఒక్కటి కావాలని కోరుకుంటున్నారు అభిమానులు. కానీ ఇదంతా రీల్ లైఫ్‌కే పరిమితమని.. రియల్‌ లైఫ్ ఇద్దరికీ వేరువేరుగా ఉంటుందని ఎన్నిసార్లు చెప్పినా సరే వీరిద్దరి మధ్య పెళ్లి రూమర్స్ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో క్రేజీ కామెంట్స్ చేశాడు సుడిగాలి

సుధీర్. ప్రజెంట్ 'గాలోడు' ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న ఆయన.. 'ఒకవేళ రష్మి మరో అబ్బాయిని పెళ్లి చేసుకుంటే అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆ రోజు కోసం వెయిటింగ్' అని చెప్పుకొచ్చాడు. కాగా బుల్లితెరపై భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న జంట.. వెండితెరపై కూడా కలిసి కనిపిస్తే బాగుంటుందని అంటున్నారు అభిమానులు.

ఇవి కూడా చదవండి: ఆ సంఘటన నుంచి కోలుకోలేకపోతున్నా: Sunaina

Advertisement

Next Story