Stree 2 Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న స్త్రీ 2.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

by Prasanna |   ( Updated:2024-08-19 11:48:38.0  )
Stree 2 Movie: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న స్త్రీ 2.. ఎంత కలెక్ట్ చేసిందంటే?
X

దిశ, సినిమా: వరుస ఫ్లాప్స్ తో బోల్తా పడిన బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి ‘స్త్రీ 2’ మూవీ మళ్ళీ కొత్త ప్రయోగాలకు ఊపిరిపోసింది. స్టార్ హీరోల సినిమాలేవి హిట్ అవ్వకపోవడంతో ఇక బాలీవుడ్ పనైపోయిందని అనుకున్నారు. రాజ్‌కుమార్ రావ్ హీరోగా, శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ‘స్త్రీ 2’. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ స్టోరీ కథ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.

రిలీజ్ కు కాకముందే పెయిడ్ ప్రీమియర్స్ తోనే కొత్త రికార్డు క్రియోట్ చేసిన ఈ మూవీ విడుదల తర్వాత ఓల్డ్ రికార్డ్స్ బ్రేక్ చేసింది. దీంతో రిలీజ్ అయినా ప్రతీ థియేటర్లో ఈ మూవీ మంచి కలెక్షన్స్ వసూళ్లు చేస్తుంది. ఆగస్టు 15న విడుదలై స్త్రీ 2 కేవలం మూడు రోజుల్లోనే 135 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రీమియర్ షో ద్వారా రూ.8.5 కోట్లు, ఫస్ట్ డే కలెక్షన్ల ద్వారా రూ.51.8 కోట్లు, సెకండ్ డే రూ.31.4 కోట్లు, శనివారం రోజున రూ.44 కోట్లు రాబట్టింది. ఇలా మొత్తం రూ. 135 కోట్లు వసూలు చేసింది.

ఈ రోజు ఈ సినిమా రూ.50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సోమవారం రక్షా బంధన్ కావడంతో కొన్ని చోట్ల సెలవు. ఇది సినిమాకు ప్లస్ అవుతుందని మేకర్స్ అంటున్నారు. ఇక ఈ సినిమాకి శ్రద్ధా కపూర్‌ రూ.5 కోట్లు రెమ్యునరేషన్‌ అందుకుంది. స్పెషల్ సాంగ్ లో కనిపించి అందాలను ఆరబోసిన తమన్నా కు అందరి కంటే భారీగానే రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed