Stree 2 Movie : షారుక్ రికార్డును బ్రేక్ చేసిన స్త్రీ 2 మూవీ

by Prasanna |   ( Updated:2024-08-16 03:45:54.0  )
Stree 2 Movie :  షారుక్ రికార్డును బ్రేక్ చేసిన స్త్రీ 2 మూవీ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ లేటెస్ట్ హారర్ సినిమా ‘స్త్రీ 2’ విడుదలకు ముందే రికార్డ్ సృష్టించింది. 2018 లో వచ్చిన ‘స్త్రీ’ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. రాజ్‌కుమార్ రావు, శ్రద్ధా కపూర్, పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రల్లో నటించారు. ఆగస్టు 15 న ఈ సినిమా ఆడియెన్స్ ముందుకు వచ్చింది. కానీ, ఒక రోజు ముందే ప్రీమియర్స్ షోస్ వేశారు.

‘స్త్రీ 2’ మూవీ 11 ఏళ్ల పాటు షారుఖ్ ఖాన్ పేరు మీద ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. షారుఖ్ ఖాన్ హీరోగా నటించిన ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’(రూ. 8కోట్లు) పెయిడ్ ప్రీమియర్స్ ను నుంచి రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమా ఏకంగా ప్రీమియ‌ర్స్‌తో రూ.10 కోట్లను కలెక్ట్ చేసింది.

దేశంలోనే అత్యధిక కలెక్షన్లు కలెక్ట్ చేసిన పెయిడ్‌ ప్రీమియర్స్ సినిమాగా బాక్సాఫీస్‌ వద్ద నిలిచింది. పెయిడ్ ప్రీమియర్స్ లోనే దుమ్ము దులుపుతుంటే.. ఇక మొదటి రోజు కలెక్షన్స్ ఏ రేంజ్లో వస్తాయో చూడాలి. రిలీజ్ కు ముందే సూపర్ రెస్పాన్స్ సాధించిన స్త్రీ 2, తన విజయాన్ని అలాగే కొనసాగిస్తూనే ఉంది. ఇంకా ముందు ముందు ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో చూడాలి.

Advertisement

Next Story