Stree 2 Movie: బాలీవుడ్ ని నిలబెట్టిన స్త్రీ 2 మూవీ

by Prasanna |   ( Updated:2024-08-22 12:08:44.0  )
Stree 2 Movie: బాలీవుడ్ ని నిలబెట్టిన స్త్రీ 2 మూవీ
X

దిశ, సినిమా : 2023 లో బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్లిన బాలీవుడ్ ఈ ఇయర్ ఢమాల్ అని కిందకు పడింది అంటే ఆ రేంజ్ హిట్స్ 2024 లో పడలేదు. స్టార్ హీరోల సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ లు అవ్వడంతో ఇక బాలీవుడ్ పనైపోయిందని కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ, ఒక్క సినిమాతో మళ్ళీ ఉపిరి పీల్చుకుంది. ఆ మూవీ ఏంటో ఇక్కడ చూద్దాం..

స్త్రీ 2 మూవీ బాలీవుడ్ ని మళ్ళీ నిలబెట్టింది. 2018 లో స్త్రీ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందో.. ఇప్పుడు అంతకి మించి ఇండస్ట్రీ హిట్ కొట్టి రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. దేశం మొత్తం ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ ఏడాది స్టార్టింగ్ నుంచి సరైన హిట్ లేక సతమవుతున్న బాలీవుడ్ కి అదిరిపోయే హిట్ ఇచ్చింది.

ఎలాంటి అంచనాలు లేకుండా ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ హార్రర్ కామెడీ రూ. 300 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్లతో రికార్డు క్రియోట్ చేసింది. ఈ మూవీలో శ్రద్దాకపూర్, రాజ్ కుమార్ రావ్ లీడ్ రోల్స్ లో నటించారు. స్త్రీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన స్త్రీ 2 మూవీ రిలీజ్ కు ముందే పెయిడ్ ప్రీమియర్స్ తో రూ. 8 కోట్లు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా తమన్నా స్పెషల్ సాంగ్ రిలీజ్ కి ముందే బజ్ క్రియేట్ చేసింది. ఇది ఈ సినిమాకి ప్లస్ అయిందనే చెప్పుకోవాలి.

Advertisement

Next Story

Most Viewed