న‌కిలీ రూ.500 నోట్లపై స్టార్ హీరో ఫొటో.. ఏదైనా జరగవచ్చు అంటూ న‌టుడు షాకింగ్ కామెంట్స్

by Kavitha |
న‌కిలీ రూ.500 నోట్లపై స్టార్ హీరో ఫొటో.. ఏదైనా జరగవచ్చు అంటూ  న‌టుడు షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తాజాగా న‌కిలీ క‌రెన్సీ ముఠా గుట్టును ర‌ట్టు చేశారు అహ్మ‌దాబాద్ పోలీసులు. అయితే.. ఈ నోట్ల‌ను చూసి అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఎందుకంటే.. ఈనోట్ల‌పై గాంధీ చిత్రానికి బ‌దులుగా బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ఫొటో ఉంది. అదేవిధంగా నోట్లపై ‘రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’కు బదులుగా ‘రిసోల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ అని ముద్రించారు. నిందితులు ఈ నోట్ల‌ను ఉప‌యోగించి 2100 గ్రాముల బంగారాన్ని కొనుగోలు చేసేందుకు ప్ర‌య‌త్నించ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఇక ప‌లువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి రూ.1.60 కోట్ల విలువైన నకిలీ క‌రెన్సీని స్వాధీనం చేసుకున్నారు. దీంతో న‌కిలీ క‌రెన్సీకి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా నకిలీ కరెన్సీపై తన ఫొటో ఉన్న విషయంపై న‌టుడు అనుప‌మ్ ఖేర్ స్పందించారు. నకిలీ డబ్బులు ఉన్న వీడియోను షేర్ చేస్తూ.. మాట్లాడటానికి సంకోచించకండి. ఐదు వందల రూపాయల నోటు పై గాంధీజీ ఫొటో బదులు నా ఫొటో? ఏదైనా జరగవచ్చు అంటూ షాకింగ్ ఎమోజీ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఎంతకు తెగించార్రా అని అంటుంటే మరికొంత మంది మీరంటే ఆ కేటుగాళ్లకి చాలా ఇష్టం అనుకుంటా అనుపమ్ ఖేర్‌జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(video link credits to anupampKher instagram id)

Advertisement

Next Story

Most Viewed