విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్?

by samatah |   ( Updated:2023-06-25 15:10:26.0  )
విడాకులు తీసుకోబోతున్న స్టార్ హీరోయిన్?
X

దిశ, వెబ్‌డెస్క్ : స్టార్ హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌లో గజిని, దశవతారం లాంటి చాలా సినిమాల్లో నటించి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత బాలీవుడ్‌లో కూడా వరస ఆఫర్స్‌తో దూసుకెళ్లింది. అయితే చాలా రోజుల తర్వాత ఆసిన్‌కు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూమర్ వైరల్ అవుతోంది.

అదేమిటంటే.. ఈ అమ్మడు తన భర్తకు విడాకులివ్వబోతుందంట. 2016లో రాహుల్ శర్మను ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి తన భర్తతో పాపతో లైఫ్ ఏంజాయ్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఆసిన్ తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది రూమర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. కొన్ని మనస్పర్ధలు కారణంగా వీళ్ళు దూరంగా ఉంటున్నారంట. భర్తకు ఆల్రెడీ వేరే అమ్మాయితో సంబంధం ఉందని , తెలుసుకున్న ఆసిన్ , పాప పుట్టినా సరే అతగాడికి డివోర్స్ ఇవ్వాలని నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. కానీ ఇప్పటి వరకు ఆసిన్ ఈ రూమర్‌పై స్పందించక పోవడం తన అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Also Read: పెళ్లి పీటలు ఎక్కిన స్టైలిష్ విలన్

Advertisement

Next Story