- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్టార్ హీరో చేతికి కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ మలయాళ థియేట్రికల్ రైట్స్.. పోస్ట్ వైరల్
దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ ‘క’. సుజీత్, సందీప్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి డైరెక్టర్లుగా పరిచయమవుతున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నాడు. ఏకంగా రూ. 20 బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమా కావండతో అందరి దృష్టి దీనిపైనే పడింది. అయితే క మూవీ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతోంది.
ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌తో పాటు వరల్డ్ ఆఫ్ వాసుదేవ్ సాంగ్ హ్యూ్జ్ రెస్సాన్స్‌ను దక్కించుకున్నాయి. తాజాగా, ‘క’ చిత్రం మలయాళ థియేట్రికల్ రైట్స్‌ను స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రొడక్షన్ కంపెనీ వేఫరర్ ఫిలింస్ సొంతం చేసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదలైంది. అయితే మలయాళంలో వరల్డ్ వైడ్‌గా ఈ సంస్థ థియేట్రికల్ రిలీజ్ చేయనుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.