స్టార్ హీరో బాలకృష్ణ ఫస్ట్ లవ్.. అనూహ్యంగా భార్య అయిపోయిన వసుంధర.. అసలు ఏం జరిగిందంటే?

by Kavitha |
స్టార్ హీరో బాలకృష్ణ ఫస్ట్ లవ్.. అనూహ్యంగా భార్య అయిపోయిన వసుంధర.. అసలు ఏం  జరిగిందంటే?
X

దిశ,సినిమా: నంద మూరి తారక రామారావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తనకంటూ ఒక క్రేజ్ ని సంపాదించుకున్నాడు.బాలయ్య బాబు గా అందరి మనసులను గెలుచుకున్నాడు.1974 లో వచ్చిన “తాతమ్మ కల” నుంచి 2023 లో వచ్చిన” భగవంత్ కేసరి” వరకూ అనేక సినిమాల్లో నటించి ఎన్నో సూపర్ హిట్స్,బ్లాక్ బస్టర్ ని ఇచ్చారు.

ఇక విషయానికి వస్తే బాలయ్య బాబుకు 1982 లో వసుంధర తో వివాహం జరిగింది.అయితే అతన్ని ఒక సందర్భంలో మీ ఫస్ట్ లవ్ ఎవరు అని అడగ్గా నాకు ఫస్ట్ లవ్ లేదు..అసలు వసుంధర తన జీవితంలో ఎలా వచ్చిందో వివరించారు.బంధువుల వివాహానికి వెళ్లిన బాలకృష్ణ అక్కడ వసుంధరని చూసి,అమ్మాయి చాలా బాగుంది అనుకొని ఇష్టపడ్డారట.బాలయ్యకి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు.ఒక రోజు పెళ్లి చూపులకి వెళ్లిన అతను షాక్ అయ్యాడంట.పెళ్లి లో చూసిన అమ్మాయి తన ఎదురుగా కూర్చున్నదంట.దానితో ఇష్టపడిన అమ్మాయే ఉండడంతో పెళ్లికి ఓకే చెప్పేశాడట.అప్పటి నుంచి వారు పరస్పరం మాట్లాడుకొని ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నాక పెళ్లి చేసుకున్నారట.ఇక వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు అనే విషయం అందరికీ తెలిసినదే.

Advertisement

Next Story

Most Viewed