- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సౌందర్య చేత బికినీ వేయించాలి అనుకున్న స్టార్ డైరెక్టర్.. ఆమె చెప్పిన ఆన్సర్ వింటే దిమ్మతిరగాల్సిందే!
దిశ, సినిమా: అలనాటి స్టార్ హీరోయిన్ సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె అందం, అభినయానికి ప్రతి ఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. అప్పటి స్టార్ హీరోలందరి సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. అయితే సౌందర్య అంటేనే ట్రెడిషనల్ బ్యూటీ.. ఎక్స్పోజింగ్ లాంటి పాత్రలోనైనా నటిస్తుంది కానీ తన లిమిట్స్ మాత్రం క్రాస్ చేయదు. అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పాపులారిటీ సంపాదించుకున్న సౌందర్యను ఒక డైరెక్టర్ బికినీ వేయమని అడిగారట. దానికి ఆమె చెప్పిన ఆన్సర్ అప్పట్లో ఆ డైరెక్టర్ కు చెప్పుతో కొట్టినట్టు ఉండింది అంటూ వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
అప్పట్లో ఓ స్టార్ డైరెక్టర్ సౌందర్యతో బికినీ వేయించాలి అని బాగా ట్రై చేశారట. అంతేకాదు ఆమెను ఇబ్బంది కూడా పెట్టారట. అయితే పదేపదే ఆ డైరెక్టర్ రిక్వెస్ట్ చేస్తూ ఉండడంతో సౌందర్య డైరక్ట్‌గా డైరెక్టర్ వద్దకువెళ్లి మ్యాటర్ చెప్పేసిందట. 'ఒక కూతురు బికినీ వేస్తే చూడాలి అని ఏ తండ్రి అనుకుంటాడు. అదేవిధంగా నేను బికినీ వేస్తే చూడాలి అని జనాలు ఎప్పటికీ అనుకోరు. ఎందుకంటే నన్ను ఓ తల్లిలా.. ఓ చెల్లిలా.. ఓ సోదరీలా భావిస్తూ ఉంటారు. తన ఇంటి అమ్మాయి అని అనుకుంటారు. నేను ఎక్స్పోజింగ్ చేస్తే ఎవరు చూడాలి అనుకోరు సార్ 'అంటూ చాలా ఘాటుగా ఉన్నది ఉన్నట్లు ఆన్సర్ చేసిందంట. అప్పట్లో ఆమె మాటలకు డైరెక్టర్ సైతం షాక్ అయిపోయారట . ప్రస్తుతం ఇదే వార్త నెట్టింట వైరల్ గా మారింది.