డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పేసి ఆ పని చేయనున్న స్టార్ డైరెక్టర్..?

by Hamsa |
డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పేసి ఆ పని చేయనున్న స్టార్ డైరెక్టర్..?
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో అభిమానులకు దగ్గరయ్యాడు. అప్పట్లో దర్శక ధీరుడు రాజమౌళి కూడా పూరి జగన్నాథ్ రికార్డ్స్‌ని కొట్టడానికి చాలా కష్టపడేవాడు. అలాంటిది ఇప్పుడు స్టార్ హీరోలు కూడా పూరీతో సినిమాలు చేయాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవల పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ‘లైగర్’ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అంతేకాకుండా పలు ఇబ్బందులు కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దీంతో పూరి జగన్నాథ్ కఠిన నిర్ణయం తీసుకున్నాడట. డైరెక్షన్‌కు గుడ్ బై చెప్పి నటుడిగా రాణించడానికి సిద్ధమవుతున్నాడట. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఎలాగైతే ఏంటీ పూరీ జగన్నాథ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story