తండ్రి కాబోతున్న SS Rajamouli.. షాకింగ్ న్యూస్

by sudharani |   ( Updated:2023-09-04 14:41:44.0  )
తండ్రి కాబోతున్న SS Rajamouli.. షాకింగ్ న్యూస్
X

దిశ, సినిమా: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి చాలామంది డైరెక్టర్స్ వచ్చారు. ఎన్నో హిట్ సినిమాలు ఇచ్చారు. కానీ తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు వ్యాపించేలా చేసింది మాత్రం దర్శకధీరుడు రాజమౌళి అనే చెప్పాలి. ఆయన ఇప్పటివరకు తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. ఇకపోతే సినీ కెరీర్ పరంగా సూపర్ సక్సెస్ అందుకున్న ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. రాజమౌళి రమను ఇష్టపడి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది రాజమౌళి మొదటి వివాహమైనప్పటికీ ఆమెకు మాత్రం ఇది రెండవ వివాహం. రమ ఇదివరకు పెళ్లి చేసుకుని కార్తికేయకు జన్మనిచ్చిన తర్వాత తన భర్తతో విడిపోయింది.

అయితే రాజమౌళి-రమ దంపతులకు పిల్లలు లేరు కానీ మయూకా అనే ఒక చిన్నారిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. ఇదిలా ఉండగా రాజమౌళి మరోసారి తండ్రి కాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త గట్టిగా వినిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే ఆడపిల్లలంటే అమితమైన ప్రేమ ఉన్నటువంటి జక్కన్న.. మరో అమ్మాయిని దత్తత తీసుకోవడానికి సిద్ధమయ్యాడు. అంటే దీని అర్థం జక్కన్న మరోసారి తండ్రి కాబోతున్నడనే కదా.

ఇవి కూడా చదవండి : Actress Priyamani : ఆ వ్యాధి కారణంగా ప్రియమణికి పిల్లలు పుట్టడం లేదా..?

Advertisement

Next Story