హాలీవుడ్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాలు

by Hajipasha |   ( Updated:2022-09-09 15:54:51.0  )
హాలీవుడ్ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఎస్‌ఎస్‌ రాజమౌళి సినిమాలు
X

దిశ, సినిమా: బియాండ్‌ ఫెస్ట్‌ అనేది హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లో విశేష ఆదరణ పొందిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా అంగరంగవైభవంగా వేడుక నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ఇక అసలు విషయం ఏంటంటే హాలీవుడ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ ఏర్పాటు చేసిన వర్చువల్‌ కాల్‌లో రాజమౌళితో బాలీవుడ్‌ దర్శకులు రుస్సో బ్రదర్స్‌ మాట్లాడారు.

ఈ నెల 27 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరగనున్న ఈ ఫెస్టివల్‌లో.. టాలీవుడ్‌ టు హాలీవుడ్‌ అనే పేరుతో ఏర్పాటు చేసిన వేదికపై రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ 'బియాండ్‌ ఫెస్ట్‌' టీమ్‌ గురువారం ట్వీట్‌ చేసింది. సెప్టెంబర్‌ 30 న 'ఆర్‌ఆర్‌ఆర్‌', అక్టోబర్‌ 1న 'ఈగ', 'బాహుబలి', 'బాహుబలి–2', అక్టోబర్‌ 21న 'మగధీర', అక్టోబర్‌ 23న 'మర్యాద రామన్న' సినిమాలను ప్రదర్శించనున్నట్లు తెలిపింది టీమ్. మొత్తానికి రాజమౌళికి దక్కిన ఈ అరుదైన గౌరవానికి గర్వపడుతున్నారు అభిమానులు.

Advertisement

Next Story