- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మగాళ్లు ఇంకెంతకాలం ఆధిపత్యం చెలాయిస్తారు : స్టార్ నటి
దిశ, సినిమా : స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ ఇండస్ట్రీలో లింగ వివక్షపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సొసైటీలోనే కాదు సినీ పరిశ్రమలో కూడా పురుషాధిక్యత కొనసాగుతోందని తాజా ఇంటర్వ్యూలో చెప్పింది. 'నిజానికి మనం ఇంకా పురుషాధిక్య సమాజంలోనే జీవిస్తున్నాం అనిపిస్తోంది. ఇది కేవలం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఉందంటే నేను అంగీకరించను. ఏ రంగంలో చూసినా మగాళ్ల ఆధిపత్యమే కనిపిస్తోంది. సమాజం ఇదే ధోరణిలో ముందుకెళ్తోంది.
ఆధునిక కాలంలో ఎన్ని మార్పులొచ్చినా లింగ వివక్ష మాత్రం నేటికీ కొనసాగడం బాధకరం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇదే సందర్భంగా తన కెరియర్ గురించి మాట్లాడిన బ్యూటీ.. ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని మళ్లీ వరుస సినిమాలు చేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఆర్టిస్ట్ లైఫ్‌ను ఆస్వాదిస్తున్నాని తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యూటీ 'సలార్, ఎన్‌బీకే107' షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
వెరైటీగా దేశభక్తిని చాటుకున్న అమ్మాయి.. చూస్తే షాకవ్వాల్సిందే?