నాలో లోపం లేదు.. పెళ్లికి అందుకే దూరంగా ఉంటున్నా..శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!

by Jakkula Samataha |   ( Updated:2024-04-16 12:04:35.0  )
నాలో లోపం లేదు.. పెళ్లికి అందుకే దూరంగా ఉంటున్నా..శ్రీముఖి షాకింగ్ కామెంట్స్!
X

దిశ, సినిమా : యాంకర్ శ్రీముఖి ( Sreemukhi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ బ్యూటీ కి సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట ఎప్పుడూ తెగ వైరల్ అవుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఈ బ్యూటీ పెళ్లి వార్త సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఈ మధ్యకాలంలో త్వరలో శ్రీముఖి పెళ్లి, వరుడు ఆయనే అంటూ ఇలా ఎన్నో వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విషయం తెలిసిందే.కాగా, మరోసారి బ్యూటీ పెళ్లి మ్యాటర్ తెరపైకి వచ్చింది. కానీ ఈ సారి, శ్రీముఖినే తన పెళ్లిపై వార్తలపై స్పందిస్తూ ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది.

గత కొద్ది రోజులుగా ఓ హీరోతో శ్రీముఖి పీకల్లోతు ప్రేమలో మునిగిపోయింది. త్వరలోనే ఆమె పెళ్లి చేసుకోబోతుంది. రాములమ్మది ప్రేమ వివాహం అంటూ నెట్టింట ట్రోల్ చేయగా.. ఆమె స్పందిస్తూ..తనకేమీ లోపం లేదని, తానే కావాలని పెళ్లికి దూరంగా ఉంటున్నాను అని తెలిపింది. ప్రస్తుతం శ్రీముఖి చేసిన ఈ కామెంట్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక శ్రీముఖి ప్రస్తుతం బుల్లితెర, వెండితెర పై తెగ హంగామా చేస్తుంది. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా నటిస్తూ .. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంటుంది. ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక్కో షోకు రూ. 2 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed