- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేను మొదటి నుంచి ఆయనకు వీరాభిమానిని.. తన ఫేవరెట్ హీరో ఎవరో చెప్పేసిన శ్రీలీల
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చేసింది రెండు సినిమాలే అయినా ఈ అమ్మడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, నటన, డ్యాన్స్‌తో ఈ ముద్దుగుమ్మ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంటుంది.ఇక ధమాక మూవీ మంచి హిట్ అందుకోవడంతో, ఈ అమ్మడు ఇప్పుడు వరస సినిమాలతో చాలా బిజీ అయిపోయింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే టాలీవుడ్ లో తన ఫేవరెట్ హీరో ఎవరన్నా విషయాన్ని కూడా బయట పెట్టింది.
ఇంతకీ శ్రీలీల ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా..? అస్సలు ఊహించలేరు. ఆయనెవరో కాదు నందమూరి నటసింహ బాలకృష్ణ. శ్రీలీలకు చిన్నప్పటి నుంచి బాలయ్య అంటే చాలా ఇష్టమంట. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తుండటంతో, ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది. శ్రీలీల మాట్లాడుతూ.. నేను బాలకృష్ణకు వీరాభిమానిని. ఇప్పుడు ఆయనతోనే సినిమా చేస్తున్నాను. ఆయన వ్యక్తిత్వం చూశాక ఇప్పుడు ఇంకా అభిమానిని అయ్యాను. ఆయన నుండి ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాను. మరెన్నో నేర్చుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది.అంతేకాదు బాలకృష్ణతో నటించే సన్నివేశాల్లో జాగ్రత్తగా ఉంటున్నానని, డైలాగ్స్ విషయంలో తప్పులు దొర్లకుండా ఎంతో ప్రాక్టీస్ చేస్తున్నానని ఆమె తెలిపింది.