Sridevi : శ్రీదేవి అత్యంత భావోద్వేగానికి లోనైన సందర్భం.. ‘ఐ లవ్ యూ లబ్బూ’ అంటూ ఎంతగా బాధపడిందో..

by Javid Pasha |
Sridevi : శ్రీదేవి అత్యంత భావోద్వేగానికి లోనైన సందర్భం.. ‘ఐ లవ్ యూ లబ్బూ’ అంటూ ఎంతగా బాధపడిందో..
X

దిశ, సినిమా : శ్రీదేవి.. ఈ పేరు గుర్తుకొస్తే చాలు ఇప్పటికీ ఆమె బతికే ఉందన్న భావన కలుగుతుందని సినీ ప్రముఖులు, అభిమానులు అంటుంటారు. భాషతో సంబంధం లేకుండా తెలుగు, హిందీ, తమిళం, మలయాళం ఇలా.. అన్ని చిత్రాల్లో నటించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసిన అలనాటి అందాల అగ్రశ్రేణి కథా నాయిక శ్రీదేవి. ఇప్పుడు మనకళ్ల ముందు లేకపోవచ్చునేమో కానీ, ఆమె చేసిన చిత్రాలు, ఆమె జ్ఞాపకాలు అందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి.

తన నటన, అభినయం, మాటతీరు, హుందాతనం, చలాకీతనం.. ఇలా అన్ని విషయాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుని అలరించిన ఈ అతిలోక సుందరి అప్పట్లో గొప్ప సంచలనం. ఆమె లేనిదే సినీ పరిశ్రమను ఊహించుకోలేం.. అన్నంతగా పేరు సంపాదించుకుంది. తుది శ్వాస విడిచే వరకు కూడా అభిమానులకు, ఆత్మీయులకు దగ్గరగానే ఉన్నది. మరుసటి రోజు చనిపోతుందనగా తన చివరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శ్రీదేవి.. ఇకలేరన్న వార్త విని సినీ ఇండస్ట్రీ మొత్తం అప్పట్లో శోక సంద్రంలో మునిగి పోయింది. ఆమె అన్ని భాషలూ మాట్లాడేది కాబట్టి ప్రతీ సినీ పరిశ్రమ వారు తమ ఇండస్ట్రీకి చెందిన సొంత నటిగానే భావించారు.

వాస్తవానికి సౌత్ నుంచి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్స్‌లో నాడు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు. స్టార్ హీరోయిన్‌గా మంచి ఫేమ్ సంపాదించుకున్న ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. వీరికి జాన్వీకపూర్, ఖుషీ కపూర్ అనే ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఆ తర్వాత వీరు కూడా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ నటనలో రాణిస్తున్నారు.

ఇదిలా ఉండగా శ్రీదేవి అప్పట్లో తన పెద్ద కూతురు జాన్వీ కపూర్‌కు ఆమె చదువు, నటన విషయంలో కొద్దిరోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందట. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన శ్రీదేవి జాన్వీకి ఒకసారి లేఖ రాశారు. ప్రజెంట్ ఈ ఎమోషనల్ లెటర్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఏముందంటే.. ‘‘ ఐ లవ్ యు నా లబ్బు.. ఈ ప్రపంచంలో నేను అత్యంగా ప్రేమించే వ్యక్తివి నువ్వు. నువ్వే నా ప్రపంచం. నువ్వు నా బెస్ట్ కూతురివి’’ అని రాసుకొచ్చింది శ్రీదేవి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా మరోసారి అభిమానులు, ప్రముఖులు శ్రీదేవి సినీ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.

Advertisement

Next Story