ఇండస్ట్రీలో కోటి పారితోషికం అందుకుని రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి హారోయిన్

by Anjali |
ఇండస్ట్రీలో కోటి పారితోషికం అందుకుని రికార్డ్ క్రియేట్ చేసిన మొదటి హారోయిన్
X

దిశ, సినిమా: ఒకప్పుడు సినిమాల్లో నటించే హీరోయిన్లకు చాలా తక్కువ రెమ్యునరేషన్ ఉండేది. కేవలం వారు పోషించే పాత్రలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చేవారు. కానీ ప్రస్తుత రోజుల్లో ఒక్కో హీరోయిన్ కోట్లకు కోట్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అప్పట్లో చాలా మంది కథానాయికలు మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజనీకాంత్, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోల సరసన నటించి కూడా కోటి రూపాయల పారితోషికం తీసుకోలేకపోయారు. కానీ ఒక్క హీరోయిన్ మాత్రం కోటి రూపాయల పారితోషికం తీసుకుందంటూ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు..

దివంగత అతిలోక సుందరి శ్రీదేవి. తెలుగు, తమిళ చిత్రాలతో పాటు హిందీలో కూడా నటించి పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది. అప్పట్లో శ్రీదేవికి భారీ పారితోషికం ఇచ్చి మరీ డైరెక్టర్లు తమ సినిమాల్లో నటించమని అడిగేవారట. పోటీ పడి మరీ ఈ హీరోయిన్ తో మూవీస్ చేయడానికి ఎదురుచూసేవారట. దీంతో ఈమె బిజీగా ఉండటం చూసి.. ఓ హిందీ చిత్రానికి ఏకంగా ఓ డైరెక్టర్ కోటి రూపాయల పారితోషికం ఇచ్చాడట. ఇండియన్ చిత్రంలోనే చరిత్రలో మొదటిసారిగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అందుకున్న నటిగా శ్రీదేవి రికార్డు క్రియేట్ చేసింది. శ్రీదేవికి అంత క్రేజ్ ఉంది కాబట్టే.. ఈమె చనిపోయిన కూడా ఇప్పటికీ కోట్లాది మంది హృదయాల్లో ఇంకా బతికే ఉంది.

Advertisement

Next Story

Most Viewed