- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Visakhapatnam : స్టేషన్ మాస్టర్ మెడకు చుట్టుకున్న ‘ఓకే’.. సస్పెన్షన్ వేటు.. భార్య నుంచి విడాకులు
దిశ, నేషనల్ బ్యూరో : భార్యతో ఫోనులో మాట్లాడుతూ వాడిన ‘ఓకే’ అనే పదం ఆ రైల్వే స్టేషన్ మాస్టర్(station master) మెడకు చుట్టుకుంది. దీంతో ఆయనను జాబ్ నుంచి సస్పెండ్ చేశారు. కట్ చేస్తే.. 12 ఏళ్ల తర్వాత సదరు రైల్వే స్టేషన్ మాస్టర్‌కు భార్య నుంచి విడాకులు కూడా మంజూరయ్యాయి. స్టేషన్ మాస్టర్ తరఫు న్యాయవాది ప్రకారం.. విశాఖపట్నం(Visakhapatnam)కు చెందిన ఓ యువకుడు రైల్వే స్టేషన్ మాస్టర్‌గా పనిచేసే వాడు. అతడి భార్య వ్యవహార శైలి మొదటి నుంచీ అనుమానాస్పదంగానే ఉండేది. మ్యారేజ్ అయ్యాక కూడా ఆమె తన ఎక్స్ లవర్‌తో ఫోన్‌లో టచ్‌లో ఉండేది. ఈవిషయమై ఇద్దరి మధ్య తరుచూ వాగ్వాదం జరుగుతుండేది. ఈక్రమంలోనే ఒక రోజు స్టేషన్ మాస్టర్ డ్యూటీలో ఉండగా.. భార్యతో ఫోనులో గొడవ జరిగింది. రైళ్ల లోకో పైలట్‌లతో కోఆర్డినేట్ అయ్యేందుకు స్టేషన్ మాస్టర్ల వద్ద వాకీటాకీ ఉంటుంది. భార్యతో ఫోనులో మాట్లాడే క్రమంలో.. ఆ వాకీటాకీ మైక్రోఫోన్ ఆన్‌లోనే ఉంది. దీంతో స్టేషన్ మాస్టర్ మాట్లాడేదంతా.. ఆ స్టేషనులో ఆగిన ఒక గూడ్స్ రైలు లోకో పైలట్‌కు స్పష్టంగా వినిపించింది.
తప్పుడు రూట్‌లో..
స్టేషన్ మాస్టర్ తన భార్యతో ఫోనులో మాట్లాడుతూ.. ‘‘మనం ఇక ఇంట్లో కూర్చొని మాట్లాడుకుందాం.. ఓకే ?’’ అని చెప్పాడు. ఈ వాక్యంలోని ‘ఓకే’ అనే పదాన్ని విన్న గూడ్స్ రైలు లోకో పైలట్.. తాను ఇక రైలుతో బయలుదేరొచ్చని అనుకున్నాడు. గూడ్స్ రైలు బయలుదేరి.. సరైన రూట్‌లో కాకుండా, తప్పుడు రూట్‌లో వెళ్లింది. దీంతో రైల్వేశాఖకు దాదాపు రూ.3 కోట్ల నష్టం వాటిల్లింది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన రైల్వే శాఖ.. స్టేషన్ మాస్టర్‌ను సస్పెండ్ చేసింది. మరోవైపు భార్యతో సదరు స్టేషన్ మాస్టర్ సంబంధాలు ఇంకా దెబ్బతిన్నాయి. ఆమె ఎక్స్ లవర్‌తోనే టచ్‌లో ఉండటాన్ని అతడు సహించలేకపోయాడు. తనకు విడాకులు ఇప్పించాలంటూ విశాఖపట్నంలోని ఫ్యామిలీ కోర్టులో 12 ఏళ్ల క్రితం పిటిషన్ వేశాడు. అయితే స్టేషన్ మాస్టర్ భార్య రిక్వెస్టు మేరకు ఈ కేసు విచారణను ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు మారుస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దుర్గ్‌లోని కోర్టు ఈ పిటిషన్‌ను కొట్టివేసింది. విడాకుల మంజూరుకు నిరాకరించింది. దీనిపై ఛత్తీస్‌గఢ్ హైకోర్టులో స్టేషన్ మాస్టర్ అప్పీల్ చేయగా.. ఎట్టకేలకు ఇప్పుడు విడాకులు మంజూరయ్యాయి.