PAWAN KALYAN-SRIREDDY: పవన్ కల్యాణ్‌పై బూతు పురాణం.. నెట్టింట దుమారం రేపుతోన్న శ్రీరెడ్డి పోస్ట్

by Anjali |
PAWAN KALYAN-SRIREDDY: పవన్ కల్యాణ్‌పై బూతు పురాణం.. నెట్టింట దుమారం రేపుతోన్న శ్రీరెడ్డి పోస్ట్
X

దిశ, సినిమా: సోషల్ మీడియా సెన్సేషన్.. హాట్ బ్యూటీ శ్రీరెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఈమె తరచూ ప్రముఖ సెలబ్రిటీలు, రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తుంటుంది. శ్రీరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనితపై సోషల్ మీడియాలో ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్రీరెడ్డిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈమె ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్‌కు సపోర్ట్‌గా మాట్లాడుతుందన్న విషయం తెలిసిందే. ఇకపోతే శ్రీరెడ్డి తాజాగా ట్విట్టర్‌లో సంచలన పోస్ట్ పెట్టింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై ఓ వీడియో ఎడిట్ చేసి నెట్టింట వైరల్ చేస్తోంది.


ఈ వీడియోలో పవన్ కల్యాణ్ ‘నాడు నేడు అమ్మ ఒడి, దీవెనలు, కానుకలు.. ఇలా ఒకటి కాదు..నోటికొచ్చిన పేర్లన్నీ పెట్టుకున్నారు. మామయ్య వస్తున్నాడు చెప్పండి. పలక బలపం పట్టుకుని అఆఇఈలు రాయిస్తే కాదు అంటూ గతంలో చెప్పిన మాటలకు.. సంక్షేమ పథకాలన్నీ మేం అపం. కచ్చితంగా సంక్షేమ పథకాలన్నీ అలాగే నడుస్తాయి. ఓ పది రూపాయలు ఎక్కువ ఇవ్వాలనుకుంటున్నాం తప్పా, తక్కువ చేయాలనుకోవట్లేదు’ అంటూ ఇటీవల పవన్ మాట్లాడిన మాటలకు జోడించి శ్రీరెడ్డి వీడియో ఎడిట్ చేసింది. అంతేకాకుండా జఫ్పా, సిగ్గులేని వెధవ అని తిట్టే ఎమోజీలను యాడ్ చేసి చివర్లో పవన్ కల్యాణ్ కింద కూర్చుని ఏడ్చే ఓ సినిమాలోని సీన్‌ను జోడించింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.



Next Story

Most Viewed