- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ కలిసిపోయిన శ్రీజ- కల్యాణ్ దేవ్.. ఆసక్తికర పోస్ట్ పెట్టిన మెగా అల్లుడు!
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజకు సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె గతంలో ఓ యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఓ కూతురు పుట్టిన అతనితో మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయింది. ఆ తర్వాత చిరంజీవి ఆమెను ఆదరించి హీరో కల్యాణ్ దేవ్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. వీరిద్దరికి కూడా ఓ కూతురు ఉంది. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరు విడిపోయి విడివిడిగా ఉంటున్నారు. దీంతో శ్రీజ, కల్యాణ్ మధ్య మనస్పర్థలు వచ్చి విడాకులు తీసుకుని విడిపోయారని వార్తలు వైరల్ అయ్యాయి. వాటిపై ఇటు మెగా ఫ్యామిలీ, కల్యాణ్ దేవ్ కానీ స్పందించలేదు. అయితే అప్పుడప్పుడు కల్యాణ్ దేవ్ తన కూతురిని మిస్ అవుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇదిలా ఉంటే మెగా ఫ్యామిలీ మొత్తం వరుణ్ పెళ్లి కోసం ఇటలీలో ఉన్న విషయం తెలిసిందే.
తాజాగా, కల్యాణ్ దేవ్ ఓ ఆసక్తికర పోస్ట్ తన ఇన్‌స్టాస్టోరీలో షేర్ చేశాడు. ‘‘ నేను 100% కాన్ఫిడెంట్‌తో చెప్తున్నాను. మా అమ్మ ప్రార్థనలు నా జీవితాన్ని నేను ఊహించిన దానికంటే ఎక్కువగా మార్చాయి’’ అని రాసుకొచ్చాడు. దీంతో అది చూసిన నెటిజన్లు శ్రీజ, కల్యాణ్ వరుణ్ పెళ్లి లో కలిసిపోయారని అనుకుంటున్నారు. అందుకే మెగా అల్లుడు హింట్ ఇస్తూ తన సంతోషాన్ని పంచుకోవడానికి ఈ పోస్ట్ పెట్టాడని చర్చించుకుంటున్నారు. అలాగే ఈ పోస్టుకు ముందు కల్యాణ్ తన కూతురు నవిష్కతో సంతోషంగా ఉన్న ఫొటోను కూడా షేర్ చేయడంతో కల్యాణ్, శ్రీజతో కలిసిపోవడం నిజమేనని అనుకుంటున్నారు.