10 రోజులుగా అనేక రకాల ఇన్ఫెక్షన్లతో నరకం చూశా.. హాస్పిటల్‌ బెడ్‌పై ఉండి ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |   ( Updated:2024-02-22 07:49:11.0  )
10 రోజులుగా అనేక రకాల ఇన్ఫెక్షన్లతో నరకం చూశా.. హాస్పిటల్‌ బెడ్‌పై ఉండి ప్రియాంక ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: జబర్దస్త్ షో ద్వారా పరిచయం అయిన వారిలో ప్రియాంక సింగ్ ఒకరు. ఆమె ఈ షోలో ఉండగానే సర్జరీ చేయించుకుని అమ్మాయిగా మారిపోయింది. ప్రియాంక సింగ్ బిగ్‌బాస్ షోలో పాల్గొని ఫుల్ పాపులారిటీ దక్కించుకుంది. అందులో మానస్‌తో కాస్త సన్నిహితంగా ఉండి అందరి దృష్టిని తనవైపుకు తిప్పుకుంది. ఇంటి నుంచి బయటకు వచ్చాక పలు టీవీ షోలతో ప్రేక్షకులకు దగ్గరవుతోంది. ప్రస్తుతం డాన్స్ షోలో పాల్గొంటుంది. తాజాగా, ప్రియాంక సింగ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ షాకింగ్ వీడియోను షేర్ చేసింది.

అందులో హెల్త్ విషయంలో తాను చేసిన తప్పు ఇంకెవ్వరు చేయడకూడదని చెబుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ ఢీ జోడి డాన్స్ షో చేస్తున్నాను. ఈ పర్ఫార్మెన్స్ కోసం 20 రోజులు కంటిన్యూగా ప్రాక్టీస్ చేశాను. అలవాటు లేని పని కావడంతో విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చాయి. నేను దాన్ని పట్టించుకోకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నాను. దాంతో డీహైడ్రేషన్‌కు గురయ్యాను. విపరీతమైన జ్వరంతో ఆసుపత్రిలో జాయిన్ అయి చికిత్స తీసుకుంటున్నాను.

గత పది రోజులుగా ఆస్పత్రిలో ఉన్నాను. 10 రోజులుగా అనేక రకాల ఇన్ఫెక్షన్‌లతో నరకం చూశాను. అయితే నేను చేసిన తప్పు ఎవరూ చేయకూడదని ఇదంతా వీడియో తీసి పెడుతున్నాను. ఈరోజుకు కొంచెం పర్లేదు. 6 రోజులవుతుంది. అన్నీంటిని మానేసి మొత్తం ఇంట్లోనే ఉండి ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నాను. మాట్లాడుతున్నా కానీ ఆయాసం వస్తుంది. ఏం తినలేని, తాగలేని పరిస్థితి వచ్చింది. మా పెద్ద అన్న వాళ్ళు వచ్చి నన్ను చూసుకుంటున్నారు’’ అంటూ చెప్పుకొచ్చింది.

Read More..

అలాంటి క్యారెక్టర్‌లే ఇస్తున్నారని.. సినిమా ఇండస్ట్రీనే వదిలేసిన హీరోయిన్



Advertisement

Next Story